శేఖర్ కమ్ముల ‘లవ్ స్టోరీ’ ఫిదా చేస్తుందా ?

శేఖర్ కమ్ముల ‘లవ్ స్టోరీ’ ఫిదా చేస్తుందా ?

Published on Jan 2, 2020 8:06 AM IST

Sekhar Kammula

బలమైన కథలతో సెన్సిబుల్ డైరెక్టర్ గా శేఖర్ కమ్ములకు మంచి పేరు ఉంది. దానికి తోడు మజిలీ, వెంకీ మామ లాంటి సూపర్ హిట్స్ తో మంచి ఫామ్ లో ఉన్న నాగచైతన్యను హీరోగా.. ఫిదా మూవీతో ఫిదా చేసిన నేచురల్ బ్యూటీ సాయిపల్లవిను హీరోయిన్ గా పెట్టి క్రేజీ కాంబినేషన్ లో ఈ సినిమా చేస్తున్నాడు. కాగా రీసెంట్ గా ఈ సినిమా నాలుగో షెడ్యూల్ మొదలు అయిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఫిల్మ్ వర్గాల సమాచారం ప్రకారం నాలుగో షెడ్యూల్ పూర్తయినట్లు తెలుస్తోంది. మొత్తానికి షూటింగ్ ను చాల వేగంగా పూర్తి చేస్తున్నారట. ముఖ్యంగా చై అండ్ సాయి పల్లవి టైం వెస్ట్ చెయ్యకుండా చాల స్పీడ్ గా షూట్ చేస్తున్నారట.

కాగా నారాయణదాస్ నారంగ్, ఎఫ్.డి.సి చైర్మైన్ రామ్మోహనరావు ఈ సినిమాకి నిర్మాతలు. ఇక స్క్రిప్ట్ విపరీతంగా నచ్చడంతో హీరో హీరోయిన్లిద్దరూ ఈ సినిమా కోసం బల్క్ డేట్స్ కేటాయించారు. ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. అయితే శేఖర్ కమ్ముల ఫిదా తర్వాత చేస్తోన్న ఈ చిత్రం మరి తెలుగు ప్రేక్షకులను మళ్లీ ఫిదా చేస్తుందా లేదా అనేది చూడాలి. అన్నట్లు ఈ సినిమా టైటిల్ ‘లవ్ స్టోరీ’ అని పెట్టినట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు