నెక్స్ట్ గ్లోబల్ అబ్సెషన్.. ‘టాక్సిక్’ పై సెల్ఫ్ ఎలివేషన్!

Toxic-Movie

కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటిస్తున్న అవైటెడ్ చిత్రమే ‘టాక్సిక్’. తన పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్స్ కేజీయఫ్ తర్వాత ఎన్నో ఏళ్ల గ్యాప్ తర్వాత ఈ సినిమా వస్తుండగా ఈసారి యష్ గ్లోబల్ మార్కెట్ ని కన్నేశాడు. అయితే ఈ చిత్రానికి కూడా పలు వాయిదాలు తప్పలేదు కానీ గ్యాప్ తీసుకున్నప్పటికీ గ్లోబల్ ఆడియెన్స్ ని టార్గెట్ చేస్తూ ప్రమోట్ చేస్తున్నారు. ఇలా లేటెస్ట్ గా విడుదల చేసిన టీజర్ ఇప్పుడు చర్చకు దారి తీసింది.

పైగా ఇందులో ఈ సినిమాని ‘నెక్స్ట్ గ్లోబల్ అబ్సెషన్’ అంటూ సెల్ఫ్ ఎలివేషన్ ఇచ్చుకోవడం కొంచెం అతిగా కొంతమందికి అనిపిస్తుంది. ఇటీవల హాలీవుడ్ నుంచి వచ్చిన చిన్న సినిమా ‘అబ్సెషన్’ ఎలాంటి సంచలనం నమోదు చేసిందో తెలిసిందే. బహుశా దానిలానే తమ సినిమా కూడా గ్లోబల్ లెవెల్లో సంచలనం సెట్ చేస్తుందని నమ్ముతున్నారో ఏమో కానీ ఇంత కాన్ఫిడెంట్ గా పెట్టుకోవడం అనేది ఇపుడు సోషల్ మీడియాలో చర్చకి దారి తీసింది. మరి కంటెంట్ ఆ రేంజ్ లో ఉంటుందో లేదో తెలియాలి అంటే ఈ ఆగస్ట్ 26 వరకు ఆగాల్సిందే.

Exit mobile version