‘బిగ్ బాస్’లో హీట్ పెంచుతోన్న సీనియర్ నటి !

‘బిగ్ బాస్’లో హీట్ పెంచుతోన్న సీనియర్ నటి !

Published on Jul 24, 2019 5:03 PM IST

తెలుగు బుల్లితెర పై ప్రేక్షకులు విశేషంగా ఆకట్టుకుంటున్న షో ‘బిగ్ బాస్’. ఎన్టీఆర్ హోస్ట్ గా చేసిన ‘బిగ్ బాస్ 1’ బుల్లి స్క్రీన్ పై ఏ రేంజ్ లో ఉరూతలు ఊగించిందో ప్రత్యేకంగా చెప్పక్కనర్లేదు. ఈ సారి అక్కినేని నాగార్జున హోస్ట్ గా ‘బిగ్ బాస్ 3’ మొదలు అయింది. మొత్తం 15 మంది పోటీదారులతో మొదలైన ఈ సీజన్ మొదటి నుంచే కాస్త రసవత్తరంగా ఉండేలా కనిపిస్తోంది. ముఖ్యంగా హేమ, శ్రీముఖి లాంటి వాళ్ళ వల్ల షో రోజురోజుకి మరి రసవత్తరంగా మారుతుంది.

ముఖ్యంగా సీనియర్ నటి హేమ సహజంగా ముక్కుసూటిగా మాట్లాడుతుంది. ఆ క్రమంలో ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేయడం ఇప్పటికే చాల సార్లు చూశాం. మరి అలాంటి ఆమె బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అవుతుంది అనగానే ప్రేక్షకులు కూడా హౌస్ లో హేమ బిహేవియర్ పై ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు.

అందుకు తగ్గట్లుగానే మొదటి వారంలోనే ఆమె హౌస్ లో టీవీ నటి హిమజతో గొడవ పడింది. అలాగే నేటి ఎపిసోడ్ లో, గాయకుడు రాహుల్ సిప్లిగుంజ్ తో కూడా హేమ గొడవ పడటానికి సిద్ధంగా ఉన్నట్లు అనిపిస్తోంది. మరి రాబోయ్ ఎపిసోడ్స్ లో హేమ ఎలాంటి గొడవలు పడుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు