హీరోయిన్ రోల్స్ ఇష్టం లేకే మానేశాను !

Published on Mar 5, 2020 1:05 am IST

సీనియర్ న‌టి అన్నపూర్ణమ్మ ప్రధాన పాత్రలో, జమున కీలక పాత్రలో రూపొందిన చిత్రం ‘అన్నపూర్ణమ్మగారి మనవడు’. ఈ చిత్రంలో మాస్టర్‌ రవితేజ టైటిల్‌ రోల్‌ పోషించారు. నర్రా శివనాగేశ్వర్‌ రావు దర్శకత్వంలో యం.ఎన్‌.ఆర్‌ ఫిలిమ్స్‌ పతాకం పై యం.ఎన్‌.ఆర్‌ చౌదరి నిర్మించారు. త్వరలో ఈ చిత్రం విడుదల కానున్న సందర్బంగా అన్నపూర్ణమ్మ పాత్రికేయులతో ముచ్చటించారు. ఈ సినిమాలో తానూ టైటిల్ రోల్ పోషిస్తున్నానని.. తానూ ఈ సినిమాలో జమీందారినిగా నటిస్తుండగా, నా మనవడిగా మాస్టర్‌ రవితేజ నటిస్తున్నాడని తెలిపారు.

అలాగే అన్నపూర్ణమ్మ ఇంకా మాట్లాడుతూ.. ఈ సినిమా కథ ఒక ఊరులోని కొన్ని కుటుంబాల కథ అని ముఖ్యంగా తన కుటుంబానికి సంబధించిన కథ అని చెప్పారు. తన మనవడు తన దగ్గరికి పని కోసం వస్తాడని.. అయితే అతను తన మనవడు అనే విషయం తనకు తెలియదని.. కానీ మనవడుకు మాత్రం నేనే తన అమ్మమ్మని అని తెలుసు అని.. మా మధ్య జరిగే మంచి ఎమోషనల్ జర్నీ ఈ సినిమా అని అన్నపూర్ణమ్మ చెప్పుకొచ్చింది.

ఇక తన కెరీర్ గురించి మాట్లాడుతూ.. తానూ హీరోయిన్ గా వచ్చానని అయితే తనకు హీరోయిన్ చేయటం ఇష్టం లేకే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారానని.. ఎక్కువుగా అక్క అమ్మ పాత్రల్లో నటించానని ఆమె తెలిపారు.

సంబంధిత సమాచారం :

More