టాలీవుడ్ కాస్టింగ్ కౌచ్ పై సీనియర్ నటి తీవ్రవ్యాఖ్యలు

Published on Jun 1, 2019 9:00 pm IST

సీనియర్ నటి రాధా ప్రశాంతి తెలుగు ఇండస్ట్రీ లో ఉన్న కాస్టింగ్ కౌచ్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. రాధా ప్రశాంతి 90 లలో వచ్చిన అనేక తెలుగు సినిమాలలో నెగటివి షేడ్స్ అలాగే గ్లామర్ కి అవకాశం ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేశారు. “పెళ్లి పందిరి”,”కూతురు” వంటి హిట్ మూవీస్ లో ఆమె ముఖ్యపాత్రలు పోషించారు. ఇన్నేళ్ల ఆమె సినిమా అనుభంలో సినిమా అవకాశాల కోసం కాంప్రమైస్ అయిన వాళ్ళను, అలాగే కాంప్రమైజ్ అయితే తప్ప సినిమా అవకాశాలు ఇవ్వనివాళ్లను చూశానన్నారు.

విశ్వనాథ్, మణిరత్నం, బాలచందర్, వంటి కొంత మంది డైరెక్టర్లు వాళ్ల పాత్రకు తగిన వారిని సినిమాలలో తీసుకునేవారున్నారు. లేకపోతే కొత్తవాళ్లకు అవకాశం ఇస్తారు. కానీ తెలుగు ఇండస్ట్రీలో అలాంటి పరిస్థితి లేదు. కాంప్రమైజ్ ఇవ్వకపోతే తెలుగువాళ్లకు అవకాశాలు ఉండవు. వేరే రాష్ట్రాలవారిని తీసుకుంటారు. మరి ఇండస్ట్రీని నమ్ముకుని వచ్చిన వాళ్లుపరిస్థితి ఏమిటని,ఆమె ప్రశ్నించింది. ఇప్పటికైనా దర్శకనిర్మాతలు, హీరోలు ఈ విషయం పై ఆలోచన చేయాలని ఆమె ఆవేదన చెందారు.

సంబంధిత సమాచారం :

More