‘అహం బ్రహ్మాస్మి’లో సీనియర్ హీరో ?

‘అహం బ్రహ్మాస్మి’లో సీనియర్ హీరో ?

Published on Apr 18, 2021 8:02 PM IST

హీరో మంచు మనోజ్‌ ప్రస్తుతం చేస్తోన్న కొత్త సినిమా ‘అహం బ్రహ్మాస్మి’. అయితే ఈ సినిమాలో ఒక కీలక పాత్ర ఉందని.. ఆ పాత్రలో ఓ స్టార్ హీరో కనిపిస్తాడని గతంలో వార్తలు వచ్చాయి. కాగా ఈ సినిమాలో ఆ గెస్ట్ రోల్ క్లైమాక్స్ లో వస్తోందట. ఆ రోల్ లో నాగార్జున ఒక నిముషం పాటు కనిపించనున్నాడట. ఇక ఎప్పుడూ కొత్తదనం కోసం వైవిధ్యమైన కథలతో సినిమాలు చేస్తాడు మనోజ్.

కాగా ఈ సారి కూడా ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో.. ‘అహం బ్రహ్మాస్మి’ అనే గొప్ప స్లోగన్ ఆధారంగా నడిచే కథతో పవర్ ఫుల్ రీఎంట్రీ ఇస్తున్నాడు. ఇక ఇండస్ట్రీలో కొత్త టాలెంట్‌ ను ఎంకరేజ్‌ చేయాలని ‘ఎమ్ఎమ్‌ ఆర్ట్స్‌’ పేరుతో మంచు మనోజ్ సొంత నిర్మాణ సంస్థను కూడా ప్రారంభించారు. దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా ఎమ్ ఎమ్ ఆర్ట్స్ పతాకం పై మంచు ఫ్యామిలీ స్వయంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు