మరోసారి గాయకుడిగా మారిన సీనియర్ హీరో !

Vikram

సీనియర్ హీరో చియాన్ విక్రమ్ ప్రస్తుతం ‘కదరం కొండన్’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. రాజేష్ ఎమ్ సెల్వ ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇటీవలే ఈచిత్రం యొక్క షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఇక తాజాగా ఈ చిత్రంలో ఒక సాంగ్ పాడారు విక్రమ్. ఇటీవల విక్రమ్ , సామి లో కూడా ఒక సాంగ్ ను పాడారు. గిబ్రాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో అక్షరా హాసన్ ముఖ్య పాత్రలో నటిస్తుంది.

ట్రైడెంట్ ఆర్ట్స్ మరియు రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం సమ్మర్ లో విడుదలకానుంది. ఇక గత కొంత కాలంగా విక్రమ్ నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటలేకపోతున్నాయి. మరి ఈ సినిమాతోనైనా విక్రమ్ హిట్ కొట్టి సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడో లేదో చూడాలి.

Exit mobile version