ఆదికేశవ మూవీకి బుల్లితెర పై సెన్సేషన్ రెస్పాన్స్!

ఆదికేశవ మూవీకి బుల్లితెర పై సెన్సేషన్ రెస్పాన్స్!

Published on Feb 15, 2024 8:02 PM IST

ఉప్పెన చిత్రం తో సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టారు యంగ్ హీరో పంజా వైష్ణవ్ తేజ్. ఈ చిత్రం తరువాత, ఏ ఒక్క సినిమా కూడా మంచి విజయాన్ని అందుకోలేదు వైష్ణవ్. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఆదికేశవ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఈ చిత్రం ఇటీవల ప్రముఖ టీవీ ఛానల్ అయిన స్టార్ మా లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారం అయ్యింది.

ఈ చిత్రం బుల్లితెర పై అద్దిరిపోయే రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఈ చిత్రం టీవీ ప్రీమియర్ గా 10.47 టీఆర్పీ రేటింగ్ ను రాబట్టడం జరిగింది. ఇది సెన్సేషన్ రెస్పాన్స్ అని చెప్పాలి. యంగ్ బ్యూటీ శ్రీ లీల లేడీ లీడ్ రోల్ లో నటించిన ఈ చిత్రం లో జోజు జార్జ్ కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు