“కస్టడీ” టీజర్ కి సెన్సేషనల్ రెస్పాన్స్.!

“కస్టడీ” టీజర్ కి సెన్సేషనల్ రెస్పాన్స్.!

Published on Mar 18, 2023 8:18 PM IST


ప్రస్తుతం మన టాలీవుడ్ లో మంచి ఆసక్తి రేపి ఆడియెన్స్ లో ఇంట్రెస్టింగ్ బజ్ ని రేపిన చిత్రం “కస్టడీ”. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అక్కినేని నాగ చైతన్య హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించిన సాలిడ్ థ్రిల్లర్ చిత్రం ఇది. మరి తెలుగు సహా తమిళ్ లో ఒకేసారి తెరకెక్కించిన ఈ సినిమా రీసెంట్ గా వచ్చిన టీజర్ తో అయితే ఒక్కసారిగా మరిన్ని అంచనాలు రేపింది.

ఇక ఈ టీజర్ కి అయితే 24 గంటల్లో నాగ చైతన్య కెరీర్ లో బిగ్గెస్ట్ రెస్పాన్స్ రాగ ఇపుడు ఈ రెస్పాన్స్ అయితే ఇంకా ఆగలేదు. లేటెస్ట్ గా ఈ టీజర్ రెండు భాషల్లో కలిపి ఏకంగా 15 మిలియన్ వ్యూస్ మార్క్ ని హిట్ చేసి ఇంకా స్ట్రాంగ్ గా దూసుకెళ్తుంది. మొత్తానికి అయితే ఈ సినిమాకి మరింత హైప్ పెరుగుతుంది అని చెప్పాలి. ఇక ఈ సినిమాకి మాస్ట్రో ఇళయరాజా మరియు లిటిల్ మాస్ట్రో యువన్ శంకర్ రాజా లు సంగీతం అందిస్తుండగా శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు