సెన్సేషనల్ రెస్పాన్స్ తో దూసుకు పోతున్న “పుష్ప 2 ది రూల్” టీజర్!

సెన్సేషనల్ రెస్పాన్స్ తో దూసుకు పోతున్న “పుష్ప 2 ది రూల్” టీజర్!

Published on Apr 12, 2024 1:12 PM IST


పుష్ప ది రైజ్ (Pushpa the rise) మూవీ తో వరల్డ్ వైడ్ సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun). ఈ చిత్రం బన్నీ కెరీర్ లో కీలక మైలురాయిగా నిలిచిపోయింది. ఈ చిత్రానికి సీక్వెల్ పుష్ప 2 ది రూల్ (Pushpa 2 the rule) భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఐకాన్ స్టార్ సరసన హీరోయిన్ గా రష్మిక మందన్న (Rashmika Mandanna) నటిస్తుండగా, స్టార్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం కి సంబందించిన టీజర్ ను బన్నీ బర్త్ డే సందర్భం గా రిలీజ్ చేయగా, సెన్సేషన్ రెస్పాన్స్ తో దూసుకు పోతుంది.

ఈ టీజర్ ఇప్పటి వరకూ 106 మిలియన్స్ కి పైగా వ్యూస్ ను రాబట్టగా, 1.5 మిలియన్స్ కి పైగా లైక్స్ ను సొంతం చేసుకుంది. ఇది సెన్సేషన్ రెస్పాన్స్ అని చెప్పాలి. జాతర సీక్వెన్స్ కి సంబందించిన ఈ టీజర్ కట్ లో బన్నీ తన నట విశ్వరూపం చూపించాడు. దేవి శ్రీ ప్రసాద్ వేరే లెవెల్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించారు. ఈ చిన్న టీజర్ తో సినిమా పై అంచనాలు మరింత గా పెరిగాయి. ఆగస్ట్ 15, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు