బాలీవుడ్ సింగింగ్ సెన్సేషన్ అరిజిత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన ఓ పాట పాడారంటే అది ఖచ్చితంగా చార్ట్ బస్టర్ అవుతుందనే ధీమా అభిమానులతో పాటు ఫిల్మ్ మేకర్స్‌లోనూ ఉంటుంది. అంతలా తన మెలోడీ పాటలతో యావత్ సంగీత ప్రేమికులను కట్టిపడేశారు. ఆయన నుంచి వచ్చిన పాటలు సరికొత్త రికార్డులు క్రియేట్ చేశాయి.
అయితే, ఇప్పుడు ఈ మెలోడీ కింగ్ పాటలకు గుడ్ బై చెబుతూ అందరికీ షాకిచ్చారు. ఇకపై తాను ప్లే-బ్యాక్ సింగర్‌గా పాటలు పాడబోనని.. తన వృత్తికి తాను సింగర్‌గా రిటైర్ ప్రకటిస్తున్నట్లు ఆయన తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం కమిట్ అయిన చిత్రాలకు మాత్రమే తాను ప్లేబ్యాక్ సింగింగ్ చేస్తానని ఆయన తెలిపారు.
అరిజిత్ సింగ్ నిర్ణయంతో యావత్ సంగీత అభిమానులు షాక్‌కు గురయ్యారు. అయితే, ఆయన ఇంత సడెన్‌గా ఎందుకీ నిర్ణయం తీసుకున్నారనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.
