సెన్సార్ పూర్తి చేసుకున్న సోలో

సెన్సార్ పూర్తి చేసుకున్న సోలో

Published on Nov 22, 2011 12:09 PM IST


నారా రోహిత్ హీరోగా వస్తున్న యాక్షన్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ చిత్రం ‘సోలో – సాలిడ్ లవ్ స్టొరీ’ నిన్న సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి గాను సెన్సార్ U/A సర్టిఫికేట్ ఇచ్చింది. కొన్ని కట్స్ చేయాలని సెన్సార్ సభ్యులు సూచించగా చిత్ర నిర్మాణ సభ్యులు వాటికి అంగీకరించారు.

ఈ చిత్రంపై ఇండస్ట్రీ వర్గాలు మంచి పాజిటివ్ రిపోర్ట్ చెబుతుండగా చిత్ర నిర్మాతలు కూడా చిత్రం విజయం సాధిస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నారు. ఈ చిత్రం ఫ్యామిలీ డ్రామాగా రూపొందింది అని, ప్రకాష్ రాజ్ నటన చిత్రానికి హైలెట్ అవుతుంది అని విశ్వసనీయ వర్గాల సమాచారం.

సోలో చిత్రాన్ని ఎస్.వి.కే బ్యానర్ పై వంశీ కృష్ణ శ్రీనివాస్ నిర్మించారు. రోహిత్ సరసన నిషా అగర్వాల్ నటించింది. మణిశర్మ అందించిన సంగీతానికి శ్రోతల నుండి మంచి స్పందన లభిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ఈ నవంబరు 25 న విడుదలకు సిద్ధమైంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు