మార్చ్ 19న రెడీగా ఉన్న సేతుపతి, నిహారికల “ఓ మంచి రోజు చూసి చెప్తా”

మార్చ్ 19న రెడీగా ఉన్న సేతుపతి, నిహారికల “ఓ మంచి రోజు చూసి చెప్తా”

Published on Feb 26, 2021 4:00 PM IST

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా మెగా డాటర్ నిహారిక కొణిదెల హీరోయిన్ గా ఆరుముగా కుమార్ దర్శకత్వంలో విడుదలై విజయవంతం అయిన తమిళ చిత్రం “ఓరు నల్ల నాల్ పాతు సోలరెన్”. మరి ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులో “ఓ మంచి రోజు చూసి చెప్తా” అనే టైటిల్ తో విడుదల చేస్తున్నారు.

శ్రీమతి రావూరి అల్లికేశ్వరి సమర్పణలో అపోలో ప్రొడక్షన్స్ పతాకం పై డాక్టర్ రావూరి వెంకటస్వామి ఈ చిత్రం తెలుగు హాక్కులను భారి ధరకి సొంతం చేస్తున్నారు. ఈ చిత్రానికి “ఓ మంచి రోజు చూసి చెప్తా” అనే పేరుతో మార్చ్ 19న విడుదల చెయ్యడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

మరి ఈ సందర్భంగా నిర్మాత డాక్టర్ రావూరి వెంకటస్వామి మాట్లాడుతూ “ఓ మంచి రోజు చూసి చెప్తా” చిత్రం తమిళం లో మంచి విజయం సాధించింది. విజయ్ సేతుపతి గారి నటన ఈ చిత్రానికే ఒక హై లైట్. విలక్షణ నటనతో ప్రేక్షకులని అలరిస్తాడు. నిహారిక కొణిదెల గారు ఎప్పుడు చేయని పాత్రలో కనిపిస్తారు.

ఇది ఒక మాస్ యాక్షన్ ఎంటర్టైనర్. తెలుగు ప్రేక్షకులకి ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ చిత్రాన్ని మార్చ్ 19 న భారీగా విడుదల చేస్తున్నాము” అని తెలిపారు.ఇక ఈ చిత్రంలో సేతుపతి, నిహారికలతో పాటుగా గౌతమ్ కార్తీక్, గాయత్రీ శంకర్, విజి చంద్ర శేఖర్, రమేష్ తిలక్ మరియు తదితరులు నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు