ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పించే ఎలిమెంట్స్‌తో ‘సుబ్రమణ్యం..’

ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పించే ఎలిమెంట్స్‌తో ‘సుబ్రమణ్యం..’

Published on Sep 20, 2015 2:46 PM IST

sfs
మెగా ఫ్యామిలీ నుంచి ఈమధ్యే హీరోగా ఎంట్రీ ఇచ్చి మెప్పించిన సాయిధరమ్ తేజ్, కమర్షియల్ హిట్స్‌తో టాప్ దర్శకుల్లో ఒకరుగా పేరు తెచ్చుకున్న దర్శకుడు హరీష్ శంకర్, నిర్మాతగా తనదంటూ బ్రాండ్ సెట్ చేసిన దిల్‌రాజు. ఈ ముగ్గురి కలయికలో రూపొంది, టాలీవుడ్‌లో ప్రస్తుతం అంతటా క్రేజీగా మారిపోయిన సినిమా ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’. హరీష్ శంకర్ స్టైల్లో రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ 24న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం గత రెండు వారాల నుంచే టీమ్ ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టింది.

ఇప్పటికే సినిమాను ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్ళడంలో మంచి విజయం సాధించిన సుబ్రమణ్యం ఫర్ సేల్ టీమ్, సినిమా రిలీజ్‌కు మరోవారం రోజులే ఉన్న నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలను మరింత వేగవంతం చేసింది. ఇక ఈ సినిమాలో ఫ్యామిలీ ఎలిమెంట్స్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని సినిమా యూనిట్ చెబుతూ వస్తోంది. ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఈ సినిమా అన్నివిధాలా ఎంటర్‌టైన్ చేసేందుకు సిద్ధమవుతోంది. సాయిధరమ్ తేజ్ సరసన రెజీనా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాపై ఇప్పటికే అంతటా భారీ అంచనాలున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు