ఆస్ట్రేలియా వెళ్తున్న షాడో

ఆస్ట్రేలియా వెళ్తున్న షాడో

Published on Feb 14, 2012 4:57 PM IST


విక్టరీ వెంకటేష్ కొత్త లుక్ తో చేయబోతున్న ‘షాడో’ చిత్రం ఇటీవలే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ చిత్ర యూనిట్ కొత్త షెడ్యుల్ కోసం ఈ రాత్రికి ఆస్ట్రేలియా వెళ్లనుంది. కీలకమైన స్టైలిష్ యాక్షన్ సన్నివేశాలు అక్కడ చిత్రీకరించనున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ స్క్రిప్ట్ రచయితలు కోన వెంకట్ మరియు గోపి మోహన్ కథ అందిస్తున్నారు. పరుచూరి కిరీటి నిర్మిస్తున్న ఈ చిత్రంలో తాప్సీ మరియు మధురిమ హీరోయిన్స్. శ్రీకాంత్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు