ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ‘షారుఖ్ ఖాన్’కి ఫుల్ క్రేజ్ ఉంది. పైగా బాక్సాఫీస్ కింగ్ ఖాన్ అనిపించుకున్నాడు షారుఖ్. నిజానికి కెరీర్ తొలినాళ్లలో టీవీ సీరియల్స్‌లో నటించిన షారుక్, ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి, బాలీవుడ్లో టాప్ హీరోగా ఎదిగారు. ఐతే, స్టార్ డమ్ సాధించిన ఎందరో అగ్ర హీరోల జీవితంలో బయటకు చెప్పుకోలేని బాధలు ఉంటాయి’ అంటూ షారుక్ తన బాధల గురించి చెప్పుకొచ్చాడు.
ఇంతకీ, షారుక్ తన జీవితంలో జరిగిన ఓ సంఘటన గురించి ఏం చెప్పాడంటే.. ‘నా పేరెంట్స్ మరణం నా సోదరిపై తీవ్ర ప్రభావం చూపింది, ఆ సంఘటన గురించి నాకిప్పటికి గుర్తుంది. ఆ రోజు నా తండ్రి మృతదేహం ముందు నా సోదరి నిలబడి కనీసం ఏడవలేదు. ఆ బాధ నుంచి నా సోదరి బయటకు రావడానికి దాదాపు రెండేళ్లు పట్టింది. అలాంటి డిప్రెషన్ కి గురి కాకుండా ఉండడానికే నేను నా సినిమాల్లో బిజీగా ఉంటా. నాకు తెలిసి జీవితంలో డబ్బు, స్టార్డమ్ కంటే ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉండడమే నిజమైన సంతోషం’ అంటూ షారుఖ్ ఖాన్ తెలిపాడు.