ఆ రోజున రిలీజ్ కానున్న షారుఖ్ ఖాన్ ‘డన్కి’ ట్రైలర్ ?

ఆ రోజున రిలీజ్ కానున్న షారుఖ్ ఖాన్ ‘డన్కి’ ట్రైలర్ ?

Published on Nov 30, 2023 2:00 AM IST


ఇటీవల పఠాన్, జవాన్ వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తో రెండు బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్ లు సొంతం చేసుకున్న బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తాజాగా రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ డన్కి. ఈ మూవీలో తాప్సి హీరోయిన్ గా నటిస్తుండగా కీలక పాత్రల్లో విక్కీ కౌశల్, బోమన్ ఇరానీ, విక్రమ్ కొచ్చర్, అనిల్ గ్రోవర్, ధర్మేంద్ర తదితరులు నటిస్తున్నారు.

రాజ్ కుమార్ హిరానీ ఫిలిమ్స్, జియో స్టూడియోస్, రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థల పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మూవీ యొక్క థియేట్రికల్ ట్రైలర్ ని డిసెంబర్ 7న విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో దీని పై మేకర్స్ నుండి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుందట. కాగా ఈమూవీని అన్ని కార్యక్రమాలు ముగించి డిసెంబర్ 21 న ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు