‘బడే మియా చోటే మియా’ కు షారుఖ్ ఖాన్ స్టంట్ మాస్టర్ క్రైజి మక్రయ్

‘బడే మియా చోటే మియా’ కు షారుఖ్ ఖాన్ స్టంట్ మాస్టర్ క్రైజి మక్రయ్

Published on Apr 2, 2024 11:00 PM IST

బాలీవుడ్ స్టార్ నటులు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ కలిసి నటించిన లేటెస్ట్ యాక్షన్ మూవీ బడే మియా చోటే మియా. ఇప్పటికే అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈమూవీని ఏప్రిల్ 10న పలు భాషల ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు. ఈ సినిమాకు భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ను ప్రముఖ స్టంట్ కొరియోగ్రఫీర్ క్రైజి మక్రయ్ అందించారు. గతంలో క్రైజి మక్రయ్ షారుక్ ఖాన్ పఠాన్, జవాన్ సినిమాలకు ఆయన ఫైట్స్ కంపోజ్ చేశారు. ఇప్పుడు బడే మియా చోటే మియాన్ సినిమాకు అదే స్థాయిలో యాక్షన్ ఎపిసోడ్స్ ను కంపోజ్ చేశారు. ట్రైలర్ లో అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ ఫైట్స్ చూస్తే క్రైజి మక్రయ్ వర్క్ కనిపిస్తుంది.

మార్చి 26న ఈ చిత్ర ట్రైలర్ ని హిందీ, తెలుగు, తమిళం, మలయాళీ, కన్నడ భాషల్లో రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ లభిస్తోంది. భారీ బడ్జెట్ లో రూపొందుతున్న ఈ చిత్రంలో ఉత్కంఠని పెంచే కథాంశం, నటీనటుల పెర్ఫామెన్స్, హై ఆక్టన్స్ యాక్షన్ సన్నివేశాలు అలరించబోతున్నాయి. బడే మియా చోటే మియా ఇద్దరూ మీ హృదయాల్ని కొల్లగొట్టడమే కాదు సీట్ ఎడ్జ్ మీద కూర్చోబెట్టే మూమెంట్స్ తో సిద్ధంగా ఉన్నారు. ఇది కేవలం చిత్రం కాదు రోలర్ కోస్టర్ రైడ్ లాగా థ్రిల్లింగ్ సీన్స్, ఎమోషనల్ సీన్స్ ఇలా ఆడియన్స్ ఏం కోరుకుంటున్నారో అవన్నీ అందించే విజువల్ వండర్ అని అంటోంది యూనిట్.

వశు భగ్నానీ, పూజా ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు ఏఏజెడ్ ఫిలిమ్స్ సంస్థ అసోసియేషన్ లో ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేస్తున్నాయి. అలీ అబ్బాస్ జాఫర్ రచన దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. వశు భగ్నానీ, దీప్షిక దేశముఖ్, జాకీ భగ్నానీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రంజాన్ కానుకగా హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ కానున్న తమ మూవీ తప్పకుండా అందరి అంచనాలు అందుకుంటుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఇందులో మానుషీ చిల్లర్, ఆలయతో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్, సోనాక్షి సిన్హా కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు