హిందీ అర్జున్ రెడ్డి హీరోయిన్ ఎవరంటే !

హిందీ అర్జున్ రెడ్డి హీరోయిన్ ఎవరంటే !

Published on May 23, 2018 4:00 PM IST


‘అర్జున్ రెడ్డి’ చిత్రం టాలీవుడ్ లో సూపర్ హిట్ సాధించి ట్రెండ్ సెట్టర్ గా నిలించింది. ఈ సినిమాతో హీరో విజయ్ దేవరకొండ స్టార్ హీరోల జాబితాలో చేరిపోయారు.ఇప్పుడు ఈ సినిమా తమిళ , హిందీ బాషలలో రీమేక్ అవుతుంది. బాలా దర్శకత్వంలో చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా వర్మ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది ఇంత వరకు ఈ సినిమాలో నటించే హీరోయిన్ ని ప్రకటించలేదు.

ఇక హిందీ లో షాహిద్ కపూర్ హీరో గా తెరకెక్కనున్న ఈ సినిమాని ఒరిజినల్ వెర్షన్ కి దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డి వంగానే ఈ సినిమాని డైరెక్ట్ చేయనుడడం విశేషం .ఈ సినిమాలో హీరోయిన్ గా తార సితారియా నటించనున్నారని సమాచారం. ప్రస్తుతం ఈ హీరోయిన్ టైగర్ ష్రాఫ్ హీరోగా కరణ్ జోహార్ నిర్మిస్తున్న ‘స్టూడెంట్ అఫ్ ది ఇయర్ 2’ చిత్రంలో ఓ కథానాయకిగా నటిస్తుంది. ఈ సినిమానే తారకు మొదటి సినిమా.

తాజా వార్తలు