ఓటిటిలో రికార్డ్స్ తిరగరాస్తున్న షారుఖ్ “జవాన్”.!

ఓటిటిలో రికార్డ్స్ తిరగరాస్తున్న షారుఖ్ “జవాన్”.!

Published on Nov 8, 2023 2:00 PM IST

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా నయనతార మరియు దీపికా పదుకోన్ లు హీరోయిన్స్ గా కోలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు అట్లీ తెరకెక్కించిన సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం “జవాన్”. మరి షారుఖ్ ఖాన్ కెరీర్ లోనే మరో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ చిత్రం రీసెంట్ గా షారుఖ్ బర్త్ డే కానుకగా అయితే ఓటిటి లో రిలీజ్ అయ్యింది. మరి ఈ సినిమా దిగ్గజ స్ట్రీమింగ్ యాప్ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేయగా ఈ చిత్రం ఇప్పుడు ఓటిటి లో కూడా రికార్డ్స్ తిరగరాస్తుంది.

గత అక్టోబర్ 30 నుంచి వచ్చిన చిత్రాల్లో ఆ వారాంతానికి హైయెస్ట్ వ్యూస్ అండ్ వ్యూవర్ షిప్ హవర్స్ ని అందుకున్న చిత్రంగా జవాన్ ఇప్పుడు భారీ రికార్డు సెట్ చేసింది. మరి బాలీవుడ్ లో అలియా భట్ నటించిన “గంగూబాయి ఖతియవాడి” చిత్రం 13.8 మిలియన్ వ్యూయింగ్ హావర్స్ ని నమోదు చేయగా..

దీనిని బ్రేక్ చేస్తూ షారుఖ్ జవాన్ చిత్రం 14.9 మిలియన్ వ్యూయింగ్ హవర్స్ తో అయితే బ్రేక్ చేసి బాలీవుడ్ లో ఒక సరికొత్త రికార్డు ని అయితే సెట్ చేసింది. మరి మొత్తానికి అయితే ఓటిటిలో కూడా షారుఖ్ తన హవా నెక్స్ట్ లెవెల్లో చూపిస్తున్నాడు అని చెప్పాలి. మరి ఓవరాల్ గా కూడా ఈ చిత్రం మిగతా రికార్డ్స్ అందుకుంటుందో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు