200 కోట్ల క్లబ్ వైపు అడుగులు వేస్తోన్న “సైతాన్”

200 కోట్ల క్లబ్ వైపు అడుగులు వేస్తోన్న “సైతాన్”

Published on Mar 24, 2024 11:08 PM IST

అజయ్ దేవగన్, మాధవన్, జ్యోతిక, జంకి బొడివాల ప్రధాన పాత్రల్లో, డైరెక్టర్ వికాస్ బాల్ దర్శకత్వం లో తెరకెక్కిన సూపర్ నాచురల్ హార్రర్ మూవీ సైతాన్. ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంటుంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకు పోతుంది. వీక్ డేస్ లో కూడా డీసెంట్ హోల్డ్ తో వసూళ్లను రాబడుతోన్న ఈ సినిమా ఇప్పటి వరకూ 130 కోట్ల రూపాయలకి పైగా నెట్ వసూళ్లు రాబట్టింది.

వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం 181 కోట్ల రూపాయలకి పైగా గ్రాస్ ను రాబట్టడం జరిగింది. దీంతో ఈ సినిమా 200 కోట్ల రూపాయల క్లబ్ వైపు అడుగులు వేస్తోంది. త్వరలో ఈ మార్క్ ను చేరుకోవడం ఖాయం. జియో స్టూడియోస్, దేవగన్ ఫిల్మ్స్, పనోరమా స్టూడియోస్ బ్యానర్ల పై నిర్మించిన ఈ చిత్రానికి అమిత్ త్రివేది సంగీతం అందించారు. లాంగ్ రన్ లో ఈ సినిమా మరింత వసూళ్లను రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు