ట్రైలర్ తో వచ్చిన ‘షకీలా’.. రిలీజ్ కి సిద్ధం !

Published on Dec 26, 2020 6:14 pm IST

ప్రముఖ నటి షకీలా జీవితం ఆధారంగా ‘షకీలా’ పేరుతో బయోపిక్ రూపొందింది. 90ల దశకంలో మలయాళ చిత్ర పరిశ్రమలో ఏ రేటెడ్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక క్రేజ్ తెచ్చుకుంది షకీలా. కాగా తాజాగా ‘షకీలా’ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్రబృందం. ట్రైలర్ ను చూస్తుంటే షకీలా పాత్రలో రిచా చద్దా నటన అద్భుతంగా ఉంది. అలాగే ఆమె ఓ రేంజ్ లో ఎమోషన్ని పలికించింది. మొత్తానికి ట్రైలర్ నెటిజన్లను బాగానే ఆకట్టుకుంటుంది.

అప్పట్లో స్టార్ హీరోలతో సమానంగా ఉండేది ఆమె క్రేజ్. ఆమె సినిమా వస్తోందంటే పెద్ద హీరోల సినిమాలు కూడ వెనక్కి తగ్గిన సంధర్భాలు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. అలాంటి సంచలన నటి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎత్తు పల్లాలు, ఆసక్తికరమైన వ్యక్తుల పాత్రలు ఉన్నాయి. వాటిని తెర మీద ఆవిష్కరించాలనే ఉద్దేశ్యంతోనే ఈ సినిమాను రూపొందించారు కన్నడ ఫిల్మ్ మేకర్ ఇంద్రజిత్ లంకేష్. ఈ సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉంది.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సంబంధిత సమాచారం :