యంగ్ హీరో కి జోడిగా అర్జున్ రెడ్డి హీరోయిన్ !

naga shourya shalini pandey

ఛలో తరువాత మళ్ళీ అలాంటి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు యంగ్ హీరో నాగశౌర్య. ఈ సినిమా తరువాత శౌర్య నటించిన మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయ్యాయి. ఇక శౌర్య ప్రస్తుతం సమంత తో నందిని రెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రంలో ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు.

ఇక ఆయన ఈసినిమా కాకుండా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ సొంత బ్యానర్ సుకుమార్ రైటింగ్స్ లో ఒక సినిమాకు సైన్ చేశాడు. కాశి విశాల్ డైరెక్ట్ చేయనున్న ఈ చిత్రంలో అర్జున్ రెడ్డి ఫేమ్ షాలిని పాండే కథానాయికగా నటించనుంది. ఈచిత్రంతో పాటు శౌర్య తనకు ఊహలు గుసగుసలాడే తో తొలి విజయాన్ని అందించిన శ్రీనివాస్ అవసరాల తో మరో చిత్రానికి ఓకే చెప్పాడు.

Exit mobile version