శంబాల’.. ఈ ఛాన్స్ వినియోగిస్తుందా..?

శంబాల’.. ఈ ఛాన్స్ వినియోగిస్తుందా..?

Published on Dec 27, 2025 1:01 AM IST

Shambala

ఈ ఏడాది క్రిస్మస్ బరిలో స్టార్ హీరోల సినిమాలు లేకపోవడంతో చిన్న, మీడియం రేంజ్ చిత్రాలకు గొప్ప వరంగా మారింది. భారీ చిత్రాల పోటీ లేకపోవడంతో, ప్రేక్షకులు తమకు అందుబాటులో ఉన్న సినిమాల్లో మంచి కంటెంట్ ఉన్న వాటి వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ అనుకూల పరిస్థితులను ఆది సాయికుమార్ నటించిన ‘శంబాల'(Shambala) చిత్రం అద్భుతంగా వాడుకుంటోంది.

కేవలం మొదటి రోజే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.3 కోట్ల 30 లక్షల గ్రాస్ వసూళ్లను సాధించడం విశేషం. ఆది సాయికుమార్ మార్కెట్ పరంగా చూస్తే ఇది చాలా పెద్ద మొత్తమని, చిత్ర బృందం చేసిన ప్రమోషన్లు మరియు పాజిటివ్ టాక్ ఈ స్థాయి వసూళ్లకు కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.

మరోవైపు విడుదలైన ‘ఛాంపియన్’ చిత్రంతో పోలిస్తే ‘శంబాల’

(Shambala)

బాక్సాఫీస్ వద్ద నిలకడగా రాణిస్తోంది. రోషన్ మేక నటించిన ‘ఛాంపియన్’ వసూళ్ల పరంగా కొంత పైచేయి సాధించినప్పటికీ, ఆ సినిమా బడ్జెట్ మరియు భారీ బ్యానర్ విలువల దృష్ట్యా అంచనాలు వేరుగా ఉన్నాయి. అయితే, ‘శంభాల’ చిత్రం రెగ్యులర్ ఫార్ములాకు భిన్నంగా, ఒక కొత్త తరహా పీరియాడిక్ డ్రామాగా ప్రేక్షకులను అలరిస్తోంది. విభిన్నమైన ప్రయత్నం కావడంతో ఆడియన్స్ ఈ సినిమాపై ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ‘ఈషా’ వంటి ఇతర సినిమాలు రేసులో ఉన్నప్పటికీ, బుకింగ్స్ పరంగా ‘శంభాల’ను అధిగమించే అవకాశం తక్కువగానే కనిపిస్తోందని ట్రేడ్ వర్గాల సమాచారం.

ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంతవరకు నిలబడుతుందనేది సోమవారం వచ్చే వసూళ్లపై ఆధారపడి ఉంటుంది. అయితే, తక్కువ బడ్జెట్‌తో రూపొందడం వల్ల ఈ సినిమాకు రిస్క్ తక్కువని, ఆదివారం నాటికి వసూళ్లు నిలకడగా ఉంటే ప్రాఫిట్ జోన్‌లోకి వెళ్లడం ఖాయమని తెలుస్తోంది. సినిమా విజయం పట్ల ధీమాగా ఉన్న చిత్ర బృందం ఇప్పటికే ప్రెస్ మీట్ నిర్వహించి తమ ఆనందాన్ని పంచుకుంది. సినిమాను మరింత ప్రజల్లోకి తీసుకెళ్లడానికి హీరో ఆది సాయికుమార్ స్వయంగా థియేటర్ల సందర్శనకు సిద్ధమవుతున్నారు. ఈ ప్లాన్ వర్కవుట్ అయితే ‘శంభాల’

(Shambala)

చిన్న సినిమాల్లో పెద్ద విజేతగా నిలిచే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు