ఇండియన్ సినిమా దగ్గర ఉన్నటువంటి లెజెండరీ దర్శకులు లిస్ట్ తీస్తే అందులో ఇప్పుడు ఎంత ఫామ్ లో లేకపోయినా తప్పకుండా ఉండే పేరు శంకర్. తాను కోలీవుడ్ దర్శకుడు అయినప్పటికీ ఇండియన్ సినిమాని హాలీవుడ్ స్టాండర్డ్స్ లో ఎప్పుడో చూపించారు. ఇదిలా ఉంటే తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నూతనంగా ఆరంభిస్తున్న మల్టిప్లెక్స్ నుంచి విజువల్స్ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
అయితే ఇందులో ఒక దగ్గర ఇండియన్ సినిమా ప్రైడ్ దర్శకుల లిస్ట్ ఫ్రేమ్స్ ఉన్నాయి. ఇందులో దాదాపు అందరు ప్రముఖ దర్శకులు తెలుగు, తమిళ్, హిందీ ఇతర భాషల నుంచి కూడా పెట్టారు. కానీ ఈ లిస్ట్ లో దర్శకుడు శంకర్ ఫ్రేమ్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. దీనితో ఆ విజువల్స్ చూసిన నెటిజన్స్ ఖచ్చితంగా ఈ లిస్ట్ లో శంకర్ లేకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
భారతీయ సినిమా దగ్గర శంకర్ అందించిన సినిమాలు తీసుకొచ్చిన టెక్నాలజీల కోసం ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఇప్పుడు ఇండియాస్ నెంబర్ 1 దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళినే శంకర్ తమకి ఓజి దర్శకుడు అని కొనియాడారు. అలాంటి దర్శకుడి ఫోటోని మిస్ చేయడం అనేది సబబు కాదు. మరి దీనిని వారు కరెక్ట్ చేసుకుంటారో లేదో చూడాలి.
