ఆ వార్తలను శంకర్ కొట్టిపడేశాడు !

Shankar

ప్రముఖ దర్శకుడు శంకర్ రూపొందిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘2.0’ చిత్రం యొక్క గ్రాఫిక్స్ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ నెలలో చిత్రానికి సంభందించిన అన్ని పనులను పూర్తి చేసి సినిమా ను నవంబర్ చివరి వారంలో ప్రేక్షకుల తీసుకురానున్నారు.

ఇక ఈచిత్రంలో అక్షయ్ కుమార్ క్రో మ్యాన్ గా కనిపించనున్నాడని కొందరు లేదు డాక్టర్ రిచర్డ్స్ పాత్రలో కనిపించనున్నాడనే వార్తలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. ఈవార్తలు కాస్త శంకర్ దాక రావడంతో దీనిపై ఆయన క్లారిటీ ఇచ్చారు.

ఈచిత్రంలో అక్షయ్ పాత్ర క్రో మ్యాన్ కాదు , రిచర్డ్స్ కాదని ఎవరి ఊహలకు అందకుండా ఆయన పాత్ర ఉంటుందని అన్నారు. దాంతో ఈ రూమర్లకు చెక్ పెట్టినట్లయింది. లైకా ప్రొడక్షన్స్ ఈ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రహమేన్ సంగీతం అందిస్తున్నారు. ఈచిత్రం యొక్క ట్రైలర్ దీపావళి రోజు విడుదలకానుంది.

Exit mobile version