గెట్ రెడీ.. రేపు “మగధీర” థియేటర్స్ లో శంకర్ మాసివ్ ట్రీట్.!

గెట్ రెడీ.. రేపు “మగధీర” థియేటర్స్ లో శంకర్ మాసివ్ ట్రీట్.!

Published on Mar 26, 2024 4:23 PM IST

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) బర్త్ డే రేపు కావున మెగా ఫ్యాన్స్ అంతా కూడా ఎంతో ఈ రోజు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు రామ్ చరణ్ బర్త్ డే కానుకగా ఆల్రెడీ పలు అప్డేట్స్ కూడా బయటకి రాగా రేపు తన ఇండస్ట్రీ హిట్ చిత్రం “మగధీర” (Magadheera) రీ రిలీజ్ కూడా ఉన్న సంగతి తెలిసిందే.

మరి ఈ రీ రిలీజ్ కి తెలుగు రాష్ట్రాల్లో అనేక థియేటర్స్ లో స్క్రీనింగ్ పడనుండగా ఈ చిత్రంతో పాటుగా మరో బిగ్ ట్రీట్ అయితే మెగా ఫ్యాన్స్ కి రాబోతునట్టుగా ఇప్పుడు వార్తలు కన్ఫర్మ్ అయ్యాయి. అయితే రేపు మగధీర థియేటర్స్ లో “గేమ్ చేంజర్” (Game Changer Update) నుంచి రాబోతున్న అవైటెడ్ సాంగ్ “జరగండి’ ని కూడా స్క్రీన్ చేయనున్నారట.

దీనితో రేపు మగధీర థియేటర్స్ లో మెగా ఫ్యాన్స్ కి డబుల్ బ్లాస్ట్ అని చెప్పాలి. మరి వారంతా అయితే శంకర్ గ్రాండ్ ట్రీట్ ని ముందే చూసే అవకాశాన్ని దక్కించుకున్నారని చెప్పాలి. ఇప్పటికే ఈ సాంగ్ పోస్టర్స్ లోనే ఏ రేంజ్ భారీతనంతో ఉంటుందో అందరికీ అర్ధం అవుతుంది. ఇక దీనిని బిగ్ స్క్రీన్స్ పై అంటే మామూలుగా ఉండదని చెప్పాలి. సో మెగా ఫ్యాన్స్ మాత్రం దీనికి కూడా రెడీ అవ్వాలని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు