“భారతీయుడు 2” కి శంకర్ మాసివ్ ప్రమోషన్స్

“భారతీయుడు 2” కి శంకర్ మాసివ్ ప్రమోషన్స్

Published on Feb 27, 2024 11:05 AM IST


తన భారీ చిత్రాలతో ఇండియన్ జేమ్స్ కేమరూన్ గా పేరు తెచ్చుకున్న సెన్సేషనల్ దర్శకుడు శంకర్ ఇప్పుడు రెండు చిత్రాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరి వీటిలో అవైటెడ్ గా “ఇండియన్ 2” కూడా ఒకటి. యూనివర్సల్ హీరో కమల్ హాసన్ తో చేస్తున్న ఈ చిత్రం తెలుగులో “భారతీయుడు 2” గా రాబోతుంది.

అయితే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యి రిలీజ్ డేట్ కోసం చూస్తుంది. మరి శంకర్ సినిమాలు అంటే భారీతనంతో పాటుగా ఇంట్రెస్టింగ్ ప్రమోషన్స్ కూడా తప్పకుండా కనిపిస్తాయి. అలాగే ఇపుడు భారతీయుడు 2 కి కూడా ఆఫ్ లైన్ లో మాసివ్ ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యాయి.

తమిళ నాట పలు ప్రాంతాల్లో భారతీయుడు తాలూకా భారీ పెయింటింగ్స్ కొన్ని బిల్డింగ్స్ పై కనిపిస్తున్న పిక్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. అయితే ఇది సినిమాలో సీన్స్ షూటింగ్ కి కూడా కావచ్చని టాక్ ఉంది కానీ ఎలానో కనిపించేది బయటే కాబట్టి పనిలో పని ప్రమోషన్స్ కూడా అయిపోతున్నట్టే అని చెప్పాలి. దీనితో శంకర్ ఇలా సాలిడ్ ప్రమోషన్స్ ని కూడా మొదలు పెట్టేశారని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు