ఊహించని లైన్ తో చరణ్, శంకర్ ల భారీ ప్రాజెక్ట్.?

Published on Mar 30, 2021 2:00 pm IST

పాన్ ఇండియన్ లెవెల్లో ఇటీవలే సెన్సేషన్ ను రేపిన భారీ ప్రాజెక్ట్స్ లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఇండియన్ జేమ్స్ కేమరూన్ శంకర్ ల కాంబోలో ప్రాజెక్ట్ కూడా ఒకటి. మరి ఈ ఊహించని కాంబో అనౌన్స్ అయ్యిన దగ్గర నుంచి ఆసక్తికర గాసిప్స్ ఈ చిత్రంపై మొదలయ్యాయి.

ఈ చిత్రంలో హీరోయిన్ దగ్గర నుంచి ఈ సినిమా కాన్సెప్ట్ వరకు అనేక రకాల ఆసక్తికర విషయాలే వినిపించాయి. మరి అలా ఇప్పుడు ఈ చిత్రం తాలూకా లైన్ పై మరో ఇంట్రెస్టింగ్ టాక్ బయటకొచ్చింది. మొదట్లో ఈ కాంబోలో స్కై ఫై థ్రిల్లర్ వస్తుంది అని తెలిసింది. కానీ నయా టాక్ ప్రకారం శంకర్ ఒక పవర్ ఫుల్ పొలిటికల్ స్క్రిప్ట్ తో కొట్టనున్నారట.

ఓ నిజాయితీ గల ఐ ఏ ఎస్ ఆఫీసర్ చుట్టూతా తిరిగే పొలిటికల్ డ్రామాగా అన్నట్టు తెలుస్తుంది. శంకర్ సినిమాలు అంటే కంటెంట్ ఎంత స్ట్రాంగ్ గా అదే సమయంలో హీరోను ఓ రేంజ్ లో ఎలివేట్ చేస్తూ ఉంటాయి. మరి ఈ చిత్రానికి శంకర్ ఇదే లైన్ ను తీసుకుంటారా లేదా అన్నది తెలియాలి అంటే ఇంకొన్నాళ్ళు ఆగక తప్పదు.

సంబంధిత సమాచారం :