
హ్యాట్రిక్ హిట్స్‌తో జోరు మీదున్న నిఖిల్ హీరోగా, ప్రముఖ కథా రచయిత కోన వెంకట్ స్క్రిప్ట్ సమకూర్చడంతో పాటు సహ నిర్మాతగా వ్యవహరిస్తూ రూపొందించిన సినిమా శంకరాభరణం. ఓ సరికొత్త కాన్సెప్ట్‌టో క్రైమ్ కామెడీ జానర్లో రూపొందిన ఈ సినిమా ప్రస్తుతం టాలీవుడ్‌లో ఈ సీజన్‌కు రానున్న సినిమాల్లో ఒక క్రేజీ ప్రాజెక్టుగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, ట్రైలర్స్ ఈ సినిమాకు భారీ అంచనాలను తెచ్చిపెట్టాయి. ఈ క్రేజ్‌తోనే డిసెంబర్ 4న పెద్ద ఎత్తున ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది.
ఇక ఇప్పటికే అన్ని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ‘శంకరాభరణం’ సినిమా నేడు సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకొని రిలీజ్‌కు రెడీ అయిపోయింది. 2 గంటల 26 నిమిషాల నిడివి గల ఈ సినిమాకు సెన్సార్ బృందం ‘యూ/ఏ’ సర్టిఫికెట్ జారీ చేసింది. ఇక సెన్సార్‌తో సహా అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌ను వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే నవంబర్ 15న వైజాగ్‌లో ప్లాటినమ్ డిస్క్ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. బాలీవుడ్ సినిమా ‘పస్‌గయారే ఒబామా’ మూలకథతో రూపొందిన ఈ సినిమా ద్వారా ఉదయ్ నందనవనం దర్శకుడిగా పరిచయమవుతూన్నారు. ఇక అంజలి ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించగా నిఖిల్ సరసన నందిత హీరోయిన్‌గా నటించారు.