
హ్యాట్రిక్ హిట్స్ అందుకొని ఫుల్ ఫాం లో ఉన్న యంగ్ హీరో నిఖిల్ హీరోగా, స్టార్ రైటర్ కోన వెంకట్ రచన – దర్శకత్వ పర్యవేక్షనలో వచ్చిన సినిమా క్రైమ్ కామెడీ ‘శంకరాభరణం’. సూపర్బ్ క్రేజ్ తో ఈ సినిమా గత శుక్రవారం తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి రోజు ఈ సినిమాకి అన్ని ప్రాంతాల నుంచి మిక్స్డ్ టాక్ మాత్రమే వచ్చింది. సినిమాలో అనుకున్న స్థాయిలో కామెడీ లేదని అలాగే, రన్ టైం కూడా ఎక్కువైందనే వార్తలు వినపడ్డాయి. దాంతో ఈ చిత్ర టీం ఈ సినిమా రన్ టైంని తగ్గించాలని ఫిక్స్ అయ్యింది.
అనుకున్నట్టుగానే ఈ రోజు నుంచి ఈ చిత్ర టీం 12 నిమిషాల సినిమాని కట్ చేసి థియేటర్స్ లో వేస్తోంది. ఈ 12 నిమిషాలు కట్ చేయడం వలన సినిమా మరింత స్పీడ్ గా తయారయ్యిందని, ఇప్పుడు ప్రేక్షకులకి ఇంకాస్త నచ్చే అవకాశం ఉందని ఈ చిత్ర టీం అంటోంది. మరోవైపు ఈ సినిమాకి మంచి క్రేజ్ రావడం, ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ కావడం వలన ఈ సినిమా కలెక్షన్స్ బాగున్నాయి. మొదటి వీకెండ్ లో 10 కోట్ల గ్రాస్ మార్క్ ని క్రాస్ చేసిందని కోన వెంకట్ తెలిపాడు. నిఖిల్ సరసన నందిత హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో అంజలి ఓ ముఖ్య పాత్రలో కనిపించి మెప్పించింది. ఉదయ్ నందనవనం డైరెక్టర్.