
హ్యాట్రిక్ హిట్స్‌తో జోరు మీదున్న నిఖిల్ అదే జోరును కొనసాగించాలన్న ఆలోచనతో ‘శంకరాభరణం’ అన్న సినిమాతో మనముందుకు వచ్చిన విషయం తెలిసిందే. గత కొద్దికాలంగా టాలీవుడ్‌లో క్రేజీ ప్రాజెక్టుల్లో ఒకటిగా చెప్పబడుతూ వచ్చిన ఈ సినిమా గత శుక్రవారం పెద్ద ఎత్తున థియేటర్లలో వాలిపోయింది. హ్యాట్రిక్ హిట్స్ హీరో నిఖిల్ సినిమా కావడం, ప్రముఖ రచయిత కోనవెంకట్ కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందించడంతో పాటు అన్నీ తానై నిర్మించడంతో ‘శంకరాభరణం’ సినిమాకు మొదట్నుంచే మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
అయితే రిలీజ్ తర్వాత మాత్రం ‘శంకరాభరణం’ ఆ అంచనాలను పూర్తి స్థాయిలో అందుకోలేదనే చెప్పాలి. మొదటి రోజే సినిమాకు మిక్స్‌డ్ రెస్పాన్స్ రావడమే కాక కథ, కథనాల విషయంలో కూడా విమర్శలు తలెత్తాయి. ఇక ఇదిలా ఉంటే శంకరాభరణం సినిమా టార్గెట్ ఆడియన్స్‌కు మాత్రం బాగానే రీచ్ అయింది. పలు చోట్ల ఇప్పటికీ మంచి కలెక్షన్స్ వచ్చాయి. దీంతో శంకరాభరణం టీమ్ ఆయా ప్రాంతాల్లో స్వయంగా థియేటర్లలో ప్రమోషన్స్ చేపడుతోంది. కరీంనగర్, వైజాగ్, విజయనగరం ప్రాంతాల్లోని పలు థియేటర్లలో నిఖిల్, కోన వెంకట్‌తో పాటు ఇతర టీమ్ మెంబర్స్ సందడి చేశారు. ఉదయ్ నందనవనం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నందిత హీరోయిన్‌గా నటించగా అంజలి ఓ ప్రధాన పాత్ర పోషించారు.