అలా మొదలైంది కన్నడ రిమేక్ లో శన్వి

shanvi
నాని నిత్యామీనన్ లు నటించిన అలా మొదలైంది రీమేక్ లో హీరోయిన్ గా శన్వి నటించనుంది. ఈ సినిమాను సాదు కోకిల దర్శకత్వం వహించనున్నారు. శైలేంద్ర నిర్మాత. నాని పాత్రను కన్నడ నటుడు సురేందర్ భర్తీ చేయనున్నాడు

ప్రేమ కధాచిత్రమ్ కన్నడ రీమేక్ లో నటించిన శన్వి వెంటనే అదే ఇండస్ట్రీలో మరో రీమేక్ లో నటించడం విశేషం. ఈ సినిమా బాలీవుడ్ లో కూడా రీమేక్ కానుంది. దీనికై నందినీరెడ్డి బాలీవుడ్ లో కొంతమందితో సంప్రదింపులు జరుపుతుంది

ప్రస్తుతం ఈ భామ ఆశలన్నీ తన తదుపరి చిత్రం ప్యార్ మైన్ పడిపోయా. ఆది హీరో గా నటిస్తున్న ఈ సినిమాను రవికుమార్ చావలి తెరకేక్కిస్తున్నాడు

Exit mobile version