సీనియర్ నటి జయప్రద ప్రధాన పాత్రలో ఆకాష్ కుమార్, మిష్టి చక్రవర్తి జంటగా ఎకెయస్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై యన్.నరసింహారావు దర్శకత్వంలో అశ్వని కుమార్ సహదేవ్ నిర్మిస్తున్న చిత్రం ‘శరభ’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని నవంబర్ 15 న విడుదలకు సిద్ధమైంది.
‘హలో బ్రదర్’ ఫేమ్ నెపోలియన్ ఈ సినిమాలో వైవిధ్యమైన విలన్ గా నటిస్తున్నాడు. అలాగే నటుడు నాజర్ , యల్. బి. శ్రీరామ్ తదితరులు ముఖ్య పాత్రలో నటించారు. ఇక ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నయన్. నరసింహారావు గతంలో తమిళ నటుడు శంకర్ వద్ద ‘అపరచితుడు, శివాజీ,రోబో, ఐ’ చిత్రాలకు దర్శకత్వ శాఖలో పని చేశాడు . దర్శకుడు ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఇది చందమామ కథల తరహాలో అందరికి తెలిసిన విధంగా అందరూ ఆసక్తి గా చూసే విధంగా ఉంటుంది. ఇది పూర్తిగా కమర్షియల్ ఎంటర్ టైనర్ అని అన్నారు.
