‘భ‌జే వాయు వేగం’ ప్రీరిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా శ‌ర్వా

‘భ‌జే వాయు వేగం’ ప్రీరిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా శ‌ర్వా

Published on May 29, 2024 1:03 PM IST

యంగ్ హీరో కార్తికేయ న‌టిస్తున్న తాజా చిత్రం భ‌జే వాయు వేగం మే 31న‌ రిలీజ్ కు రెడీ అయ్యింది. ప్ర‌శాంత్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా టీజ‌ర్, ట్రైల‌ర్ల‌కు ప్రేక్ష‌కుల నుండి మంచి రెస్పాన్స్ ద‌క్కింది. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి విజ‌యాన్ని అందుకుంటుందా అని అంద‌రూ ఆస‌క్తిగా చూస్తున్నారు.

ఇక ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ ను ఘ‌నంగా నిర్వ‌హించేందుకు చిత్ర యూనిట్ సిద్ధ‌మైంది. కాగా, ఈ వేడుక‌కు చీఫ్ గెస్ట్ గా యంగ్ హీరో శ‌ర్వానంద్ హాజరుకానున్న‌ట్లు చిత్ర యూనిట్ వెల్ల‌డించింది. ద‌స్ప‌ల్లా హోట‌ల్స్ లో బుధ‌వారం జ‌ర‌గనున్న ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ కు శ‌ర్వా గెస్టుగా వ‌స్తున్న‌ట్లు చిత్ర యూనిట్ కాసేప‌టి క్రితం ట్వీట్ చేసింది.

ఈ సినిమాలో అందాల భామ ఐశ్వ‌ర్య మీన‌న్ హీరోయిన్ గా న‌టిస్తోండగా, ర‌వి శంక‌ర్, రాహుల్ హ‌రిదాస్, త‌నికెళ్ల భ‌ర‌ణి త‌దిత‌రులు ఇత‌ర‌ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని యూవీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ ప్రొడ్యూస్ చేస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు