మహేష్ మాస్ స్టిల్ ను తలపిస్తున్న శర్వా ఫస్ట్ లుక్.!

మహేష్ మాస్ స్టిల్ ను తలపిస్తున్న శర్వా ఫస్ట్ లుక్.!

Published on Mar 6, 2021 11:00 AM IST

మన టాలీవుడ్ లో ఉన్న మంచి యంగ్ అండ్ టాలెంటెడ్ హ్యాపెనింగ్ హీరోల్లో శర్వానంద్ కూడా ఒకడు. ముందుగా శర్వాకు జన్మదిన శుభాకాంక్షలు..ఎప్పుడో తన సినీ “ప్రస్థానం”ను మొదలు ఇప్పుడు ఒక “మహాసముద్రం” వరకు వచ్చాడు. తనదైన సబ్జెక్టులు చేస్తూ తనకంటూ మంచి మార్కెట్ ను శర్వా తెచ్చుకున్నాడు.

అలా ఇప్పుడు శర్వానంద్ కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులు చేస్తుండగా వాటిలో టాలెంటెడ్ దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న “మహా సముద్రం” కూడా ఒకటి.ఇప్పటికే మంచి బజ్ ను తెచ్చుకున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ నేడు శర్వానంద్ పుట్టినరోజు సందర్భంగా ఒక మాస్ అండ్ ఇంటెన్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

అయితే ఇందులో శర్వా బీచ్ దగ్గర పడవల్లో వాడే ఇంజిన్ రాడ్ పట్టుకొని మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. కానీ ఇదే లుక్ అచ్చు సూపర్ స్టార్ మహేష్ నుంచి కూడా ఒకటి. తాను మరియు బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ కాంబోలో వచ్చిన సెన్సేషనల్ హిట్ “శ్రీమంతుడు”లోని ఒక స్టిల్ ఉంటుంది.

ఇప్పుడు రెండు ఫోటోలు పక్కపక్కన పెట్టి మహేష్ ఫ్యాన్స్ స్పెషల్ గా విష్ చేస్తున్నారు. అయితే ఆదమరుపులో కానీ శర్వా లుక్ చూస్తే మహేష్ పోస్టర్ నే ఖచ్చితంగా గుర్తుకు రాక మానదు. ఇక ఈ చిత్రాన్ని మేకర్స్ ఆగష్టు 19న విడుదలకు ఖరారు చెయ్యగా తెలుగు మరియు తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు