శర్వానంద్ తో ఆ నిర్మాణ సంస్థ మరోసారి?

Published on Jun 3, 2020 10:02 pm IST


టాలీవుడ్ టైర్ 2 టాప్ హీరోలలో శర్వానంద్ కూడా ఒకరు. ఎలాంటి రోల్ లో అయినా సరే చక్కగా ఇమిడిపోయే శర్వాకు ఇప్పుడు సరైన హిట్ లేదు. అలాంటి ఒక సమయంలోనే శర్వాకు “రన్ రాజా రన్” అనే సినిమాతో ఒక అదిరిపోయే కం బ్యాక్ హిట్ వచ్చింది.

ఆ తర్వాత మళ్ళీ శర్వా తిరిగి చూసుకోలేదు. అక్కడ నుంచి వరుస విజయాలను అందుకున్నాక మళ్ళీ వరుస ప్లాప్ సినిమాలు శర్వాకు తప్పలేదు. అప్పుడు రన్ రాజా రన్ తో హిట్ ఇచ్చిన యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఇప్పుడు శర్వా మరో సినిమాలో నటించనున్నట్టు తెలుస్తుంది.

అలాగే ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు శ్రీరామ్ రెడ్డి కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించనున్నారట. శర్వాను హిట్ ట్రాక్ లో పెట్టిన ఈ బ్యానర్ మరోసారి శర్వాకు మళ్ళీ అదే సాలిడ్ కం బ్యాక్ ఇస్తుందో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :

More