కాన్సెప్ట్ బేస్డ్ సినిమాల పై దృష్టి పెట్టనున్న శర్వానంద్

కాన్సెప్ట్ బేస్డ్ సినిమాల పై దృష్టి పెట్టనున్న శర్వానంద్

Published on Feb 9, 2015 8:47 PM IST

Sharwanand
‘మళ్ళి మళ్ళీ ఇది రాని రోజు’ చిత్రం శర్వానంద్ కి మంచి విజయాన్ని సాధించి పెట్టింది. తాజా సమాచారం ప్రకారం శర్వా ఒకేసారి ఎన్నో చిత్రాలలో నటించదలుచుకోలేదు. తనదైన శైలిలోనే భవిష్యత్ కార్యాచరణని సిద్ధంచేసుకున్నాడు.

మంచి కాన్సెప్ట్ వున్న చిత్రంలోనే కమర్షియల్ విలువలు కూడా వుండే విధంగా స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాడు. శర్వా వినూత్నమైన కధ కలిగివున్న రెండు చిత్రాలకి సైన్ చేసాడని సమాచారం. ఇదిలావుండగా ”మళ్ళి మళ్ళీ ఇది రాని రోజు” చిత్రంలో శర్వానంద్ నటనకి పాత్రకి మంచి స్పందన లభిస్తుంది. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ హిట్ దిశగా సాగుతుంది.

తాజా వార్తలు