హీరో ‘శర్వానంద్’ తన కెరీర్ మొదటి నుండి వైవిధ్యమైన పాత్రలను చేస్తూ వస్తోన్నాడు. పాతికేళ్ల వయసులోనే నలభై ఏళ్ల వ్యక్తిగా నటించి మెప్పించిన సినిమాలు ఉన్నాయి శర్వా కెరీర్ లో. అయితే గత కొన్ని సినిమాలుగా సూపర్ హిట్ కోసం బాగా కష్టపడుతున్న శర్వానంద్ మరో వైవిధ్యమైన సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రకాష్ అనే ఒక కొత్త దర్శకుడు చెప్పిన ఒక వికలాంగుడికి సంబంధించిన కథ శర్వానంద్ కు బాగా నచ్చిందట. ఈ సినిమాలో హీరోగా నటించడానికి శర్వానంద్ ఒప్పుకునట్లు తెలుస్తోంది.
కాగా శర్వానంద్ ఫేమస్ కొరియోగ్రఫర్ రాజు సుందరం దర్శకత్వంలో మరో సినిమా కూడా ఒప్పుకున్నాడట. తమిళంతో పాటు ఒకేసారి తెలుగులో కూడా తెరకెక్కబోతుంది ఈ సినిమా. గతంలో 2011లో వచ్చిన తమిళ్ సినిమా ‘ఎంగేయుమ్ ఇప్పోతుమ్’ (తెలుగులో జర్నీ)లో శర్వానంద్ ప్రధాన పాత్రలో నటించి తమిళ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాడు. అయితే తమిళ సినిమా చేసి దాదాపు ఎనిమిది సంవత్సరాలు అవుతుంది. మళ్ళీ ఇన్నేళ్ల తరువాత ఇప్పుడు తమిళ సినిమాలో నటించబోతున్నాడు. మొత్తానికి శర్వానంద్ కొత్త సినిమాలు బాగా ఆసక్తి కలిగించేలా ఉన్నాయి.


