చరణ్ దగ్గరికి ఫస్ట్ వెళ్తాను – శర్వానంద్!

చరణ్ దగ్గరికి ఫస్ట్ వెళ్తాను – శర్వానంద్!

Published on May 30, 2024 1:27 AM IST

యంగ్ హీరో కార్తికేయ నటించిన భజే వాయు వేగం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రశాంత్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఐశ్వర్య మీనన్ కథానాయిక గా నటిస్తుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరగగా, దీనికి ముఖ్య అతిథిగా నటుడు శర్వానంద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా శర్వానంద్‌ ను కారికేయ కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు అడిగాడు.

రామ్ చరణ్ అన్నా, ప్రభాస్ అన్నా ఒకేసారి ఫోన్ చేస్తే ముందుగా ఎవరిని కలుస్తారు? అని కార్తికేయ ప్రశ్నించారు. చరణ్ దగ్గరికి ఫస్ట్ వెళ్తా, ఆ తర్వాత ప్రభాస్ అన్నను కలుస్తానని అన్నారు. భజే వాయు వేగంలో క్రికెట్ కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి, శర్వానంద్ ఏ క్రికెటర్‌ని ఎక్కువగా ఆరాధిస్తాడని కార్తికేయ అడిగాడు. కింగ్ కోహ్లీ తన ఆల్ టైమ్ ఫేవరెట్ క్రికెటర్ అని వెల్లడించాడు. రన్ రాజా రన్ విజయం తన కెరీర్‌లో సెంచరీ మూమెంట్ అని శర్వానంద్ అన్నారు. చాలా మంది శర్వానంద్‌ను టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పోలుస్తుంటారు. కార్తికేయ శర్వానంద్‌కి అదే చెప్పి రోహిత్ శర్మ బయోపిక్ చేస్తావా అని అడిగాడు. శర్వానంద్, జీవితంలో క్రికెట్ ఆడను కాబట్టి నో చెప్పాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు