క్రేజీ అప్ డేట్ కి రెడీ అయిన శర్వానంద్ ‘మనమే’

క్రేజీ అప్ డేట్ కి రెడీ అయిన శర్వానంద్ ‘మనమే’

Published on Apr 17, 2024 9:41 PM IST

వెర్సటైల్ యాక్టర్ శర్వానంద్ ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నటిస్తున్న మూవీ మనమే. శర్వానంద్ కెరీర్ 35వ సినిమాగా రాబోతున్న ఈ మూవీలో కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా హేషం అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ అనౌన్స్ మెంట్ గ్లింప్స్ ఆడియన్స్ ని ఆకట్టుకుంది. అనంతరం ఈ మూవీ నుండి ‘ఇక నా మాటే’ అంటూ సాగే మొదటి పాటని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. మెలోడీయస్ గా సాగిన ఈ సాంగ్ కూడా ఆడియన్స్ ని అలరించింది.

ఇక తాజాగా ఈ మూవీ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య టీజర్ రిలీజ్ అప్ డేట్ ని అందించారు. తమ మూవీ యొక్క టీజర్ అప్ డేట్ ని రేపు ఉదయం 10 గం. ల 8 ని. లకు అందించనున్నట్లు శ్రీరామ్ ఆదిత్య తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ మూవీని గ్రాండ్ గా నిర్మిస్తుంది. కాగా ఈ మూవీ కథ ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ తో ఉండబోతుందని టాక్. మరి శ్రీరామ్ ఆదిత్య ఎలాంటి కథ, కథనాలతో ఈ మూవీని తీస్తున్నారో అలానే శర్వానంద్ దీనితో ఎంత మేర విజయం అందుకుంటారో చూడాలి. అలానే త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు