శర్వానంద్ ‘మనమే’ టీజర్ రిలీజ్ టైం లాక్

శర్వానంద్ ‘మనమే’ టీజర్ రిలీజ్ టైం లాక్

Published on Apr 18, 2024 9:41 PM IST

వెర్సటైల్ యాక్టర్ శర్వానంద్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ మనమే.

ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, ఫస్ట్ సాంగ్ తో అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ టీజర్ ని రేపు రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన మేకర్స్ తాజాగా రిలీజ్ టైం ని అనౌన్స్ చేసారు.

కాగా మనమే టీజర్ ని రేపు మధ్యాహ్నం 12 గం. ల 34 ని. లకు రిలీజ్ చేయనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఫై టిజి విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్న ఈ మూవీ రిలీజ్ డేట్ త్వరలో అనౌన్స్ చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు