శర్వానంద్ ‘మనమే’ ట్రైలర్ రిలీజ్‌కు డేట్ ఫిక్స్

శర్వానంద్ ‘మనమే’ ట్రైలర్ రిలీజ్‌కు డేట్ ఫిక్స్

Published on May 30, 2024 7:01 PM IST

యంగ్ హీరో శర్వానంద్ సినిమాలకు ప్రత్యేక ఫాలోయింగ్ ఉంటుంది. ఆయన సినిమా వస్తుందంటే యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా థియేటర్లకు క్యూ కడతారు. ఆయన ప్రస్తుతం నటిస్తున్న ‘మనమే’ చిత్రం కూడా ఈ కోవకే చెందింది. ఇప్పటికే ఈ సినిమా ప్రేక్షకుల్లో మంచి పాజిటివ్ వైబ్స్‌ను క్రియేట్ చేసింది. ఈ మూవీ పోస్టర్స్, ఫస్ట్ సాంగ్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. దీంతో ఈ సినిమా నుండి మరిన్ని అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

ఈ తరుణంలో ‘మనమే’ మూవీ టీమ్ ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్‌ను ప్రకటించింది. ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్‌కు డేట్ ఫిక్స్ చేశారు మేకర్స్. జూన్ 1న ‘మనమే’ మూవీ ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్లు వారు ఓ పోస్టర్ ద్వారా అనౌన్స్ చేశారు. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ పూర్తి ధీమాతో ఉన్నారు. ఇక ఈ సినిమాలో నటీనటుల పర్ఫార్మెన్స్ క్లాసిక్‌గా ఉండబోతున్నట్లు టీమ్ చెబుతోంది.

శర్వా మెయిల్ లీడ్‌లో నటిస్తున్న ఈ సినిమాలో అందాల భామ కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. రాహుల్ రామకృష్ణ, సీరత్ కపూర్, రాహుల్ రవిచంద్రన్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా, అయెషా ఖాన్ ఓ స్పెషల్ సాంగ్‌లో కనిపించనుంది. ఈ చిత్రాన్ని శ్రీరామ్ ఆదిత్య డైరెక్ట్ చేస్తుండగా, టిజి విశ్వప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. హీషం అబ్దుల్ వాహబ్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. జూన్ 7న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు