కన్ఫర్మ్ : శర్వానంద్ నెక్స్ట్ మూవీ ఆ డైరెక్టర్‌తోనే..!

Sharwanand

ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ తాజా చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్‌ను నమోదు చేసింది. ‘సామజవరగమనా’ ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంయుక్త, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటించారు.

ఈ విజయాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం తాజాగా సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా శర్వానంద్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ప్రకటన చేసి అభిమానులను ఆనందపరిచాడు. తెలుగు సినీ పరిశ్రమకు ఎన్నో ఐకానిక్ కామెడీ ఎంటర్‌టైనర్లను అందించిన దర్శకుడు శ్రీను వైట్లతో తాను చేతులు కలపబోతున్నట్టు ఆయన వెల్లడించారు.

అలాగే ఈ సినిమా సంక్రాంతి 2027లో థియేటర్లలో విడుదల కానుందని శర్వానంద్ స్పష్టం చేశారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవి శంకర్ నిర్మించనున్నారు. నటీనటులు, సాంకేతిక బృందానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటించనున్నట్లు సమాచారం.

Exit mobile version