శరవేగంగా సాగుతున్న శర్వానంద్, నిత్యా మీనన్ ల సినిమా

Sharwanand-Nithya-Menon-mov
త్వరలో శర్వానంద్, నిత్యా మీనన్ నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ సినిమాను క్రాంతి మాధవ్ తెరకెక్కిస్తున్నాడు. కె.ఏ వల్లభ నిర్మాత. కె.ఎస్ రామారావు సమర్పకుడు

కేవలం మొదటి షెడ్యూల్ లోనే సినిమా 50శాతం షూటింగ్ పూర్తిచేసుకుంది. వైజాగ్ లో 50 లక్షలు ఖర్చుపెట్టి అక్కడ ప్రధాన తారాగణం పై కొన్ని ముఖ్య సన్నివేశాలను చిత్రీకరించారు. హైదరాబాద్ లో జూన్ 1స్ట్ నుండి రెండో షెడ్యూల్ ప్రారంభించనున్నారు

ఉయ్యాలా జంపాల సినిమాలో కనిపించిన పూర్ణరవి ఈ సినిమాలో ముఖ్యపాత్రపోషించాడు. శర్వానంద్ ఈ సినిమాలో క్రీడాకారుడిగా కనిపించనున్నాడు. గోపి సుందర్ సంగీతదర్శకుడు. గుణశేఖర్ సినిమాటోగ్రాఫర్. సాయి మాధవ్ బుర్రా సంబాషణలు అందించారు

Exit mobile version