ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న శర్వా ‘నారీ నారీ నడుమ మురారి’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎందులో అంటే..?

Nari Nari Naduma Murari 1 1

చార్మింగ్ స్టార్ శర్వానంద్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’ సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ అయింది. దర్శకుడు రామ్ అబ్బరాజు డైరెక్ట్ చేసిన ఈ సినిమా పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను అలరించడంలో విజయం సాధించింది. సంక్రాంతి బరిలో రిలీజై శర్వా ఖాతాలో మరో సూపర్ హిట్ చిత్రంగా ఈ మూవీ నిలిచింది.

ఇక ఈ ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమాను ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్‌కు తీసుకొస్తున్నారు మేకర్స్. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 4 నుండి స్ట్రీమింగ్ చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో ఈ చిత్రాన్ని థియేటర్లలో చూడనివారు ఇప్పుడు ఓటీటీ వేదికగా చూసి ఎంజాయ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు.

ఈ సినిమాలో అందాల భామలు సంయుక్త, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటించగా నరేష్, సంపత్ రాజ్, వెన్నెల కిషోర్, సత్య తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించగా ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర ప్రొడ్యూస్ చేశారు.

Exit mobile version