జెట్ స్పీడ్‌లో రానున్న శర్వా.. ఏడాది కాలంలో ఏకంగా నాలుగు..!

Sharwanand

చార్మింగ్ స్టార్ శర్వానంద్ ప్రస్తుతం ‘నారీ నారీ నడుమ మురారి’ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. పక్కా యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్‌ను కూడా ఆకట్టుకుంటోంది. ఇక ఈ సినిమాతో శర్వానంద్ చాలా కాలం తర్వాత అదిరిపోయే సక్సెస్ అందుకున్నాడు.

ఇక ఇప్పుడు ఇదే ఊపును కంటిన్యూ చేయాలని శర్వా భావిస్తున్నాడట. ఈ క్రమంలోనే తన నెక్స్ట్ చిత్రం ‘బైకర్’ను వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలని ఆయన చూస్తున్నాడు. ఆ తర్వాత సంపత్ నంది డైరెక్షన్‌లో ‘భోగి’ చిత్రాన్ని కూడా ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయనున్నారు. దసరా లేదా దీపావళి కానుకగా ఈ చిత్రాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కాగా, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ సినిమాను 2027 సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు శర్వా ఇప్పటికే అనౌన్స్ చేశాడు.

ఇలా 2026 సంక్రాంతి నుంచి 2027 సంక్రాంతి వరకు ఏకంగా నాలుగు సినిమాలను అభిమానులకు అందించాలని శర్వా ప్రయత్నిస్తున్నాడు. మరి ఈ సినిమాలతో ఆయన ఎలాంటి సక్సె్స్ అందుకుంటాడో చూడాలి.

Exit mobile version