శర్వా ‘బైకర్’ బిజినెస్ క్లోజ్.. డీటెయిల్స్ ఇవే..!

శర్వా ‘బైకర్’ బిజినెస్ క్లోజ్.. డీటెయిల్స్ ఇవే..!

Published on Feb 21, 2026 9:00 AM IST

Biker

గత కొంతకాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూసిన హీరో శర్వానంద్, ఈ సంక్రాంతికి ‘నారి నారి నడుమ మురారి’ చిత్రంతో సాలిడ్ హిట్ అందుకున్నాడు. బరువు తగ్గి, తన పాత చార్మ్‌ను తిరిగి తెచ్చుకున్న శర్వా, ఈ రిఫ్రెషింగ్ మూవీలో అద్భుతమైన నటనతో అలరించాడు. ఈ సినిమా సక్సెస్‌తో శర్వానంద్ మళ్లీ ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాడు. ఆయన నటన సినిమాకు ప్రధాన బలంగా నిలవడమే కాకుండా, బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించి శర్వాను తిరిగి ఫామ్‌లోకి తెచ్చింది.

​ప్రస్తుతం శర్వానంద్ నెక్స్ట్ చిత్రం ‘బైకర్’ సమ్మర్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ సినిమా విడుదల కంటే ముందే భారీ డీల్స్ క్లోజ్ చేసుకుని రికార్డు సృష్టిస్తోంది. ఈ చిత్రం నాన్-థియేట్రికల్ హక్కులు ఏకంగా రూ.35 కోట్లకు అమ్ముడయ్యాయి. ఇందులో భాగంగా నెట్‌ఫ్లిక్స్ సంస్థ డిజిటల్ రైట్స్‌ను రూ. 27 కోట్లకు దక్కించుకుంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు థియేట్రికల్ హక్కులను భారీ ధరకు కొనుగోలు చేశారు. ఈ డీల్స్ ద్వారా నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ అప్పుడే లాభాల్లోకి వెళ్లగా, థియేటర్లలో ఈ సినిమా మంచి విజయం సాధిస్తే దిల్ రాజుకు కూడా భారీ లాభాలు రావడం ఖాయం.

​శర్వానంద్ కెరీర్ ఇప్పుడు ఫుల్ స్వింగ్‌లో ఉంది. ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో ‘భోగి’ షూటింగ్‌లో పాల్గొంటున్న ఆయన, ఈ ఏడాది చివర్లో ఆ సినిమాను విడుదల చేయనున్నాడు. ఆ వెంటనే శ్రీను వైట్ల దర్శకత్వంలో ఒక ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్‌ను పట్టాలెక్కించనున్నాడు. ఈ ప్రాజెక్ట్‌ను 2027 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు