లేటెస్ట్…శర్వానంద్ “మనమే” రిలీజ్ డేట్ ఫిక్స్!

లేటెస్ట్…శర్వానంద్ “మనమే” రిలీజ్ డేట్ ఫిక్స్!

Published on May 24, 2024 6:59 PM IST

టాలెంటెడ్ యాక్టర్ శర్వానంద్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం మనమే. శర్వానంద్ కెరీర్ లో ఇది 35 వ చిత్రం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌ పై టిజి విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ చిత్రం రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు మేకర్స్. జూన్ 7 వ తేదీన వరల్డ్ వైడ్ గా థియేటర్ల లోకి రిలీజ్ కానుంది. ఇదే విషయాన్ని సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు.

రిలీజ్ చేసిన పోస్టర్ ఆడియెన్స్ ను అలరిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి, టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా, విక్రమ్ ఆదిత్య కీలక పాత్రలో కనిపించనున్నారు. విష్ణు శర్మ, జ్ఞాన శేఖర్ వీఎస్ సినిమాటోగ్రాఫర్‌లు కాగా, హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తుండగా, కృతి ప్రసాద్, ఫణి వర్మ ఎగ్జిక్యూటివ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ టెక్నీషియన్ ప్రవీణ్ పూడి ఎడిటర్, జానీ షేక్ ఆర్ట్ డైరెక్టర్. ఈ చిత్రానికి డైలాగ్స్‌ని అర్జున్ కార్తిక్, ఠాగూర్, వెంకీ అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు