
శర్వానంద్ సినిమాల ఎంపిక గురించీ, అతడి నటన గురించి ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన పనిలేదు. ఇప్పుడున్న యంగ్ జనరేషన్లో విలక్షణ సినిమాలను, పాత్రలను ఎంచుకుంటూ వెళుతోన్న శర్వానంద్ రన్ రాజా రన్, మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు లాంటి సినిమాలతో కమర్షియల్‌గా మంచి హిట్స్ అండుకున్నాడు. తాజాగా ఆయన యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే! వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన మేర్లపాక గాంధీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.
ఇదిలా ఉంటే.. ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే శర్వానంద్ మరో సినిమాకు కూడా సెట్స్పైకు తీసుకెళ్ళినట్లు తెలుస్తోంది. భాస్కర్ అనే యాడ్ ఫిల్మ్ దర్శకుడితో శర్వానంద్ మరో సినిమా చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైందట. నివేదిత థామస్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించనుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.